TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published on: Sun May 4, 2025 8:37AM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో తిరుమల వెంకన్న సర్వదర్శనం తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం వైకుంఠ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. ఇక, శనివారం తిరుమల వెంకన్నను 84,113 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,868 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం రూ.4.12 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.