Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
posted on: Apr 13, 2024 9:03AM
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (ఏప్రిల్ 12) శ్రీవారిని మొత్తం 63వేల 163 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31 వేల 287 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 2కోట్ల 99 లక్షల రూపాయలు వచ్చింది.
ఇక శనివారం శ్రీవారి ఉచిత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండపోయి క్యూలైన్ బయటి వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది.
ఇక టైమ్స్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వారికి శ్రీవారి దర్శనానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి భక్తులకు నాలుగు గంటల సమయం పడుతోంది.



.webp)


