తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
Published on: Wed May 24, 2023 10:15AM
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం తిరుమల శ్రీవారిని 75వేల 875 మంది భక్తులు దర్శించుకున్నారు.
35వేల 439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండా ఆదాయం 4 కోట్ల 9లక్షల రూపాయలు వచ్చింది.
ఇక బుధవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 20 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.


