మరోమారు సీఎం కానివ్వను...సంక్షోభం నాట దేవెగౌడ సంచలనం

posted on: Jul 8, 2019 10:00AM

 

కన్నడ రాజకీయం రసకందాయంలో పడింది. ప్రభుత్వం మీద కత్తి కట్టిన పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మిస్సయిన సంగతి తెలిసిందే. మిస్సయిన వారందరూ గోవాకి వెళ్ళారని కొందరు అంటుంటే లేదు ముంబైలోని ఒక హోటల్ లో బీజేపీ అండర్ లో ఉన్నారని కొందరు అంటున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద మాత్రం మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు. రాజీనామా చేసిన 12 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా ఆయన సన్నిహితులేనని గౌడ ఆరోపించారు. ఇలా కుట్రలతో మరోసారి సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని కానివ్వనని వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయ సంక్షోభం ముగుస్తుందనే విషయాన్ని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. 

ఇదే విషయాన్ని శివకుమార్ కూడా చెప్పారని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మళ్లీ సీఎంను కానివ్వబోమని, అవసరం అనుకుంటే మద్దతు ఉపసంహరించడానికి కూడా వెనుకాడబోమని కానీ సిద్దరామయ్యను మాత్రం మళ్ళీ సీఎం కానివ్వనని గౌడ వ్యాఖ్యానించారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకే సిద్ధరామయ్య తన సన్నిహిత ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారని ఆయన ఆరోపణ. మరి ఈ సంక్షోభానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి మరి.

google-ad-img
    Related Sigment News
    • Loading...