ఫార్మా కంపెనీల వల్లే వ్యాధుల విస్తరణ.. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య

posted on: Oct 15, 2022 4:13PM

ఫార్మా కంపెనీలు అనైతిక కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడుతున్నాయా? వైరల్ వ్యాధుల విస్తరణకు ఫార్మా కంపెనీలు చట్ట వ్యతిరేక  చర్యలే కారణమా? మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను బట్టి ఔననే అనుకోవాల్సి వస్తోంది.

 కాగా ఇటీవలి కాలంలో ప్రజలు పబ్లిక్ డొమైన్ లో గ్రామీణ,పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో   నిరుపేద రోగులకు  కాలం చెల్లిన మందులు  పంపిణీ చ్రేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు    కొన్నిరకాల వ్యాధుల  వ్యాప్తికి ఫార్మా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఒక పద్దతి ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడటమే కారణమా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. 

ఈ పిటిషన్ విచారించిన  మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ సుబ్రహ్మణ్యం   కాలం చెల్లిన మందుల పంపిణీ, వైరస్  వ్యాధుల విస్తరణ కు ఫర్మా కంపెనీలు దోహదపడేలా వ్యవహరిస్తున్నాయా అన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తమిళనాడు ఆరోగ్య శాఖ, తమిళనాడు ప్రభుత్వాలను  ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి    సుప్రీం కోర్టు  ఫార్మా కంపెనీలు మంద్రుల ప్రచారానికి వేల కోట్ల రూపాయలు వినియోగించడంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.  .  

google-ad-img
    Related Sigment News
    • Loading...