అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఎంజీఆర్

 

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అంతకపల్లి గ్రామపంచాయతీలో ఆధ్యాత్మికంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రకృతి సేద్యం చేస్తూ రాధాకృష్ణ పారాయణం పటిస్తున్న  కుర్మా గ్రామంలో ఇటీవలే సంభవించిన అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకొన్న పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు  ఘటన స్థలాన్ని పరిశీలించారు. 

అనంతరం అయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించి నివేదికను త్వరితగతిన ఉన్నత అధికారులను ఆదేశాలు జారీ  చేశారు అనంతరం తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దారు,ఎంపీడీవో,సర్కిల్ ఇన్స్పెక్టర్,సబ్ ఇన్స్పెక్టర్, సచివాలయం సిబ్బంది,తోపాటు ఎంపీపీ ప్రతినిధి తూలుగు తిరుపతిరావు,మండల అధ్యక్షులు యళ్ళ నాగేశ్వరరావు,మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu