TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ విచారం

Published on: Sat Jun 14, 2025 5:27PM

 

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని కూర్మ గ్రామంలో  అగ్నికి ఆహుతవ్వడం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  విచారం వ్యక్తం చేశారు. ఆధుని హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుతున్న గ్రామం కూర్మ అక్కడ అగ్నిప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. పోలీసులు లోతుగా విచారణ చేయాలి వారు డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం దీపాల వల్ల జరిగిందని అల్లరి మూకలపై ప్రమేయం లేదని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

ప్రశాంతతకు భంగం వాటిల్లింది. ఆధ్యాత్మిక చింతనతో, ప్రకృతి ఒడిలో జీవనం సాగించే ఈ గ్రామంలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరం కొన్నిరోజుల కిందట జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది.  ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఎవరైనా దుండగులు ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలు జరిగాయని మందిర నిర్వాహకుల్లో ఒకరైన ప్రభుదాస్ పోలీసులకు వివరించారు. 

కూర్మ గ్రామంలో ప్రస్తుత పరిస్థితిపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైంది. కూర్మ గ్రామవాసులు యాంత్రిక జీవన విధానాలకు భిన్నంగా మట్టి ఇళ్ళల్లో ఉంటూ ప్రకృతి వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. వేద విద్యను అభ్యసించే చిన్నారులు సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. వర్తమాన కాలంలో విశిష్టంగా ఉన్న ఈ గ్రామం పునరుద్ధరణపై దృష్టి సారించాలి" అని పవన్ స్పష్టం చేశారు.