Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రైల్లో సీటు ఇవ్వలేదని..కళ్లల్లో కారం చల్లాడు
posted on: Jun 22, 2017 5:29PM

కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై కారం చల్లి పారిపోయాడు. ముంబైలో జరిగిన ఈ సంఘటన ఒక పక్క ఆసక్తికరంగానూ..మరోవైపు మనిషి ఎలా మారుతున్నాడో తెలుపుతుంది. షాహాద్ స్టేషన్‌లో ఓ వ్యక్తి లోకల్ ట్రైన్ ఎక్కాడు. కంపార్ట్‌మెంట్ అంతా కిక్కిరిసిపోవడంతో అతనికి సీటు దొరకలేదు. కాసేపు నిలబడినప్పటికీ ఇక ఓపిక లేక కొందరిని సీటు ఇవ్వమన్నాడు. అయితే అందుకు ఎవ్వరూ అంగీకరించకపోవడంతో వాగ్వివాదానికి దిగాడు. దీంతో చేసేది లేక మిన్నకుండిపోయాడు. ఆ తర్వాత రైలు మరో స్టేషన్‌లో ఆగాక తన వద్ద ఉన్న కారం పొడిని ప్రయాణికులపై చల్లాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురికావడంతో వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గాలిస్తున్నారు.






