ఢిల్లీ గ్యాంగ్ రేప్: శిక్షపై తీర్పు వాయిదా

 

 Delhi gang rape case, 2012 Delhi gang rape, Delhi gang rape verdict

 

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుపై తీర్పు శుక్రవారానికి వాయిదా పడింది. ఈ కేసులో దోషులకు శిక్ష ఖరారుపై సాకేత్ కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. అనంతరం న్యాయవాది శిక్షపై తీర్పును శుక్రవార౦ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేశారు. దోషులపై ఏ విధమైన జాలి చూపవద్దని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దోషులకు గరిష్ట స్థాయి శిక్ష వేయాలని, వారికి మరణశిక్ష విధించడమే సరైందని అన్నారు.


దోషులను కోర్టుకు బుధవారం ఉదయంతీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా దోషులుగా తేలినవారిలో ఒకతను తాను నిర్దోషినని గట్టిగా అరిచాడు. రెండు సార్లు అతను గట్టిగా అరిచి ఆ మాట అన్నాడు. దోషులకు మరణశిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు, తమకు భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని నిర్భయ తండ్రి అన్నారు.