యాంటీ రేప్ లా...ఢిల్లీ గ్యాంగ్ రేప్ నిందితులకు ఉరిశిక్ష?

 

డిసెంబర్ 16వ తేదీన డిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై వాద ప్రతివాదనలు నిన్నటితో పూర్తీ అవడంతో, ప్రత్యేకంగా నియుక్తమయిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఐదుగురు నేరస్తులకి వ్యతిరేఖంగా ఈ రోజు(శుక్రవారం) చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. ఆరవ నేరస్తుడు మైనర్ (17సం.ల 5నెలలు) అయిన కారణంగా అతనిని బాలనేరస్తుల కోర్టులో విచారిస్తున్నారు. అయితే, బాల నేరస్తులకి కటిన శిక్షలు వేసేందుకు చట్టం ఒప్పుకోదు గనుక, అతను కేవలం 3 సం.ల జైలు శిక్షతో కేసును నుండి తప్పిచుఒనే అవకాశం ఉంది.

 

నిన్న జరిగిన కేంద్ర కేబినేట్ మంత్రివర్గ సమావేశంలో, జస్టిస్ వర్మ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకొని, కేంద్రం ఒక ఆర్డినెన్స్ చేసి రాష్ట్రపతి ఆమోదానికి వెంటనే పంపింది. కేంద్రం చేసిన తాజా సిఫారసుల ప్రకారం ఇంతవరకు అత్యాచార కేసుల్లో విదిస్తున్న 10సం జైలు శిక్షను రెట్టింపు చేస్తూనే, అవసరమయితే దానిని జీవిత కాల ఖైదుగా మార్చే వీలుకల్పించింది. మరణ శిక్షను రద్దు చేయమన్న వర్మ కమిటీ సిఫారుసును పక్కన బెట్టి, బాదితురాలు మరణించినా లేదా ఆమె శాశ్వితంగా కోమాలోకి వెళ్ళిపోయిన సందర్భంలో కోర్టులు మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంచింది. అయితే బాల నేరస్తుల వయసుని 18 నుండి 16కి తగ్గించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఈ విషయమై న్యాయ నిపుణులతో, రాజకీయ పార్టీలతో సంప్రదించాక ఒక నిర్ణయం ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పింది.

 

అందువల్ల, ప్రస్తుతం 6వ నేరస్తుడు మైనర్ అయిన కారణంగా కటిన శిక్షల నుండి తప్పించుకొనే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలలో ఈ విషయంపై చర్చ జరిగి బాలనేరస్థుల వయోపరిమితి తగ్గిస్తూ ప్రత్యేక చట్టం రూపు దిద్దుకొంటే తప్ప అందరి కంటే అతి కిరాతకంగా అత్యాచారంచేసి, బాధితురాలి శరీరంలోకి ఇనుప రాడ్డును దూర్చి ఆమె మరణానికి కారకుడయిన బాలనేరస్తుడికి శిక్షపడే అవకాశం లే