Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాలనా వ్యవస్థ లోపాలపై శర సంధానం.. వాస్తవ వేదిక
posted on: Nov 27, 2025 1:34PM

ఇల్లు అలకగానే పండగ కాదు. రాష్ట్రాలు విభజించగానే సమస్యలు తీరిపోవు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కోటి సమస్యలు. మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువారిని విడగొట్టిన నాటి పరిస్థితులకూ, నేటికీ పెద్ద తేడా లేదు. ఆనాడు కర్నూలు రాజధానిగా పాలించడానికి నానా కష్టాలూ పడ్డారు పాలకులు. నేడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితీ అదే. ప్రణాళికలు బ్రహ్మాండంగా ఉన్నా, ఆచరణలో వాటి అమలుకు అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఒక వైపు నిధుల కొరత, మరో వైపు రుణాలపై వడ్డీల భారం, ఇంకో వైపు అడుగడుగునా అవినీతి సర్పాలు బుసలు కొడుతున్నాయి. అమరావతి రాజధానిగా త్వరగా ఎదగాలనుకునే వారి కన్నా, ఎందులో సొమ్ములు దొరుకుతాయోనని వెతుక్కునే నేతలు, దళారులూ ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అభివృద్ధి ‘‘మూరెడు ముందుకి, బారెడు వెనక్కి’’ అన్నట్లు సాగుతోంది.
రాష్ట్ర విభజన జరిగాక, తొలి ఐదేళ్లలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు కార్యాలయ విభాగాల తరలింపు జరిగినా, తదుపరి ఐదేళ్లు పాలించిన వైసీపీ ప్రభుత్వం దీని నిర్మాణం జోలికి పోలేదు. పైగా విధ్వంసకర నిర్ణయాలు, రాజకీయ విద్వేషాలతోనే అభివృద్ధిని సర్వనాశనం చేసింది. కూటమి ప్రభుత్వం పేరుతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన నారా చంద్రబాబునాయుడు తిరిగి దానిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ 15 నెలలు గడిచినా ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
దీంతో అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఎలా జరగాలి అనే అంశాలతో పాటు, తెలుగువారి రాష్ట్ర చరిత్రను టచ్ చేస్తూ, 95 ఏళ్ల చరిత్ర కలిగిన స్వాతంత్ర కాలం నాటి వార పత్రిక జమీన్ రైతు, అమరావతి రైతుల గుండె ఘోషతో పాటు 25 ఏళ్లుగా అనేక సమస్యలతో రాజీలేని పోరాటం చేస్తున్న ‘‘తెలుగువన్’’ డిజిటల్ ఛానల్ తో కలిసి పోరాటం ప్రారంభిస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎలుగెత్తి, పరిష్కారమే లక్ష్యంగా, నిర్మొహమాటంగా వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు నేటి నుంచి తెలుగువన్ డిజిటల్ లో ‘‘వాస్తవ వేదిక’’పై చర్చా కార్యక్రమం ప్రారంభమౌతోంది. జమీన్ రైతు ఎడిటర్, నెల్లూరు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ లు ఈ వేదిక ద్వారా ప్రభుత్వం, పాలకుల అవినీతి, అక్రమాలు, అసమర్థ విధానాలపై శర సంధానం చేయనున్నారు.
ప్లీజ్ వాచ్ ఇట్
నవంబర్ 27వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి..


.webp)
.webp)


