Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పిల్లలకు ఈ ప్రదేశాలలో తగిలే గాయాలను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమూ తెలుసా?
posted on: Jan 22, 2025 9:30AM

పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వాళ్లకు కాస్త నడక వచ్చిందంటే చాలు.. ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. తమ తల్లిదండ్రులను, పెద్దలను కూడా పరుగులు పెట్టిస్తారు. అయితే కాళ్లు, చేతుల ప్రాంతాలలో కలిగే గాయాలు, దెబ్బలు మందు రాస్తే లేదా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ పిల్లల హడావిడి ఆటల్లో వారికి చాలా సార్లు తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నిజానికి ఇలా తలకు దెబ్బలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది. పిల్లలు నొప్పికి ఏడిస్తే బుజ్జగించడం, దెబ్బ తగిలిన ప్రాంతంలో రుద్దడం వంచివి చేయడం వల్ల నొప్పి తగ్గేలా చేస్తారు. గాయాలు అయ్యి చర్మం దెబ్బ తిన్నప్పుడు లేదా రక్తం కారడం వంటివి జరిగినప్పుడు తప్ప వైద్యులను సంప్రదించడం జరగడం లేదు. అయితే పిల్లలకు పదే పదే తలకు దెబ్బ తగలడం అంత తేలికగా తీసుకోవాల్సి విషయం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు.
చిన్న పిల్లలకు ఏదైనా గాయాలు తగిలినప్పుడు చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చెయ్యాలని చూస్తారు. పిల్లలకు కోతలు, కాలిన గాయాలు జరిగితే వాటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చాలామంది పేస్ట్ రాయడం, కొబ్బరినూనె రాయడం, బర్నల్ వంటి ఆయింట్మెంట్లు రాయడం, పసుపు పెట్టడం వంటివి చేస్తారు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇవి చేయకూడదు. వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది.
పిల్లలకు తగిలే గాయాలు, వారికి అయ్యే కోతలు వంటివి కొన్నిసార్లు పైపైన కాకుండా లోతుగా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు ఇచ్చే వైద్యమే సరైనది.
తల గాయాలు..
పిల్లల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే.. పదే పదే దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. చాలా వరకు తలకు దెబ్బలు తగులుతాయి కానీ ఎలాంటి నష్టం బయటకు కనిపించదు. కానీ ఇలాంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటే మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్పెక్షన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
పిల్లలకు గాయాలు, దెబ్బలు తగిలితే మొదట గాయాలు క్లీన్ చేయడానికి శుభ్రమైన నీరు, డెట్టాల్ లేదా మెడికేషన్ వైప్ వంటివాటితో శుభ్రం చేయాలి. వైద్యులు సూచించిన మందులను ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా వాడాలి. తరువాత వైద్యుడిని సంప్రదించాలి. తగిలిన ప్రాంతం నల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే లోపలి ప్రాంతంలో రక్తం గడ్డ కట్టిందని అర్థం. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు తగిలే దెబ్బల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
*రూపశ్రీ.


.webp)
.webp)


