డీఎస్ గవర్నర్ భేటీ.. రాష్ట్రాల వివాదాలపై చర్చ

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారు డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణకు ఇతర రాష్ట్రాలు కర్నాటక, మహారాష్ట్రలతో పలు అంశాల్లో వివాదాలున్నప్పటికీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఉన్న వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి చొరవ చూపాలని, అదే విధంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన ప్రయోజనాలపై దృష్టిసారించాలని డి శ్రీనివాస్ గవర్నర్‌ను కోరినట్టు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu