డీఎస్ కు ప్రభుత్వ సలహాదారు పదవి..
posted on Aug 21, 2015 3:07PM

డీఎస్ కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ లోకి మారిన సంగతి తెలసిందే. అలా పార్టీ మారారో లేదో అప్పుడే కేసీఆర్ తనకు పదవిని కట్టబెట్టేశారు. అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేశారు. అంతేకాదు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా జీవో జారీ చేశారు. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా డీఎస్ కు ఫోన్ చేసి చెప్పడం జరిగిందట. దీనికి డీఎస్ హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని.. తనపై నమ్మకంతోనే ఇంతటి బాధ్యతను అప్పగించారని.. కెసిఆర్‌కు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని.. నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పారు.
గత నెల జూలై 8వ తేదీన డీఎస్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమక్షంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తాను బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని.. అంతేకాని పదవుల మీద వ్యామోహంతో కాదని చెప్పిన సంగతి తెలిసిందే.