TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మక్కాలో క్రేన్ కూలి 107 మంది దుర్మరణం

Published on: Sat Sep 12, 2015 9:02AM

 

సౌదీ అరేబియాలో ముస్లింల ప్రముఖ పుణ్యక్షేత్రం మక్కా మశీదు వద్ద మరమత్తులు జరుగుతున్న సమయంలో ఒక భారీ క్రేన్ కూలిపోవడంతో మశీదులో ఉన్న సుమారు 107మంది దుర్మరణం చెందారు. మరో 238 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం సాయంత్రం స్థానిక కాలమాన ప్రకారం 5.10 గంటలకి జరిగింది. మక్కాలో చెదురుముదురుగా వర్షాలు పడుతున్నాయి. క్రేన్ తో వర్కర్లు పనిచేస్తున్న సమయంలో చాలా భారీగా ఈదురుగాలులు రావడంతో క్రేన్ నియంత్రణ కోల్పోయి కుప్పకూలినట్లు సమాచారం. గాయపడిన వారిని తక్షణమే ఆసుపత్రులకు తరలించి అత్యవసర చికిత్సలు అందజేస్తున్నారు.