Latest News

మచిలీపట్నంలో బాణాసంచా పేలుడు.. ఒకరి మృతి

posted on: Oct 21, 2014 6:07PM

 

తూర్పు గోదావరి జిల్లా పాకతిప్పలో సోమవారం నాడు బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు జరిగి 18 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి తెలుగు ప్రజలు ఇంకా తేరుకోకముందే కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. మచిలీపట్నం బైపాస్‌ రోడ్డులోని ఒక ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కిరణ్ అనే యువకుడు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...