Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి
posted on: Aug 2, 2019 3:59PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం విశాఖలో ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్ లో వైసీపీ తీరు ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. ప్రధాని మోడీతో.. సీఎం జగన్ అనైతిక, అప్రజాస్వామ్య పొత్తు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ పొత్తు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ పోరాటాలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పార్లమెంట్ లో నోరు ఎందుకు విప్పడం లేదని బృందాకారత్ ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని బృందాకారత్ డిమాండ్ చేశారు.






