Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దేశంలో లక్షకు దగ్గరగా రోజువారి కేసులు.. తెలంగాణలో కొవిడ్ కల్లోలం
posted on: Jan 6, 2022 9:48AM
దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతోంది. మంగళవారం ఒక్కరోజే 58,097 కేసులు నమోదు కాగా... బుధవారం వైరస్ మరింతగా విస్తరించింది. గత 24 గంటల్లో ఏకంగా 90,928 మందికి కరోనా నిర్దారణ అయిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 90 వేలకు పైగా కొత్త కేసులు రాగ.ా.. కరోనా నుంచి 19,206 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2 లక్షల 85 వేలకు చేరింది. బుధవారం 325 మంది కొవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో పాజిటివిటీ రేటు 6.43 శాతంగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా కరోనా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,531 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా వీరిలో 1,520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తెలంగాణలో ప్రస్తుతం 6,168 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో తెలంగాణలో ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు.


.webp)



