హైదరాబాద్ లో సగం మందికి కరోనా! సీసీఎంబీ సర్వేలో సంచలన విషయాలు

posted on: Mar 4, 2021 5:35PM

హైదరాబాద్ ను కరోనా మహమ్మారి ముంచెత్తుతోంది. సైలెంట్ గా, సౌండ్ లేకుండా.. అందరినీ కమ్మేస్తోంది. కరో్నా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు తగ్గిందో తెలీకుండా.. వ్యాపిస్తోంది. ఈ మాట ఎవరో అంటున్నది కాదు. ప్రతిష్టాత్మక సీసీఎంబీ ఈ విషయం ప్రకటించింది. 

హైదరాబాద్‌లో 54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయంటూ షాకింగ్ న్యూస్ వెల్లడించింది సీసీఎంబీ. 56శాతం మహిళలు, 53శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని తెలిపింది. యాంటీబాడీలు ఉన్న 75శాతం మందికి కరోనా వచ్చినట్టు కూడా తెలియలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్‌ బయోటెక్‌ - ఎన్‌ఐఎన్‌తో కలిసి సీరో సర్వే చేసింది సీసీఎంబీ. నగరంలోని 30 వార్డుల్లో తొమ్మిదివేల మంది నమూనాలు పరిశీలించి పరీక్షించారు. ఫలితాల్లో 54 శాతం మందికి కొవిడ్ యాంటీబాడీలు ఉండటం సంచలనంగా మారింది. 

మరోవైపు, ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 2,99,406 మందికి వైరస్‌ సోకింది. వీరిలో 2,95,821 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 1637 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1948 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే, ఇవన్నీ కరోనా అని తెలిసి, పరీక్ష చేసుకొని, నిర్ధారించుకున్న వారి సంఖ్య మాత్రమే. కానీ, సీసీఎంబీ సర్వే ప్రకారం ఇంకా లక్షలాది మందికి కొవిడ్ సోకినట్టు తెలుస్తోంది. బయటకు లక్షణాలేవీ కనిపించకపోవడంతో వారెవరికీ కరోనా సోకినట్టు తెలీలేదు. ఒక్క హైదరాబాద్ సిటీలోనే సగం మందిలో యాంటీబాడీలు ఉండటం కలవరానికి గురి చేస్తోంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...