Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ ఫోన్ అన్ లాక్ కు కోర్టు అనుమతి
posted on: Oct 14, 2025 1:28PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ34 అయిన చెరుకూరి వెంకటేశ్ నాయుడి ఐఫోన్ ను అన్ లాక్ చేసేందుకు విజయ వాడ ఏసీబీ కోర్టు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి పి. భాస్కరరావు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసు దర్యాప్తులో వెంకటేశ్ నాయుడి ఫోన్ అత్యంత ముఖ్యమైన ఆధారమని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) భావిస్తోంది. గతంలో డబ్బు కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను అధికారులు ఇదే ఫోన్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని డిజిటల్ ఆధారాలు, కీలక సంభాషణలు, ఇతర సమాచారం ఈ ఫోన్‌లోనే భద్రపరిచి ఉండవచ్చని సిట్ బృందం బలంగా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో, ఫోన్ లాక్‌ను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కొన్ని రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, వెంకటేశ్ నాయుడి ఫోన్ అన్ లాక్ కు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.






