జగన్ మెమోపై కౌంటర్.. సీబీఐను ఆదేశించిన కోర్టు
Published on: Tue Nov 11, 2025 11:12AM
.webp)
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ముందు విదేశీ పర్యటనలకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో సోమవారం (నవంబర్ 10) విచారణ జరిగింది.
అలాగే తాను ఈ నెల 14న విచారణకు హాజరు కావాలంటూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఆయన దాఖలు చేసిన మెమోపై కూడా కోర్టు విచారించింది. కాగా జగన్ మెమోపై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశిస్తే విచారణను మంగళవారం (నవంబర్ 11)కు వాయిదా వేసింది.


