శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్
posted on Mar 31, 2013 7:03AM
.png)
ఓబుళాపురం మైనింగ్ అక్రమాల్లో సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీలక్ష్మికి సిబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి తనకు తానుగా లేచి నిలబడలేని పరిస్థితి, ఎడమ కాలు పూర్తిగా స్వాధీనం తప్పే స్థితికి వస్తుండటం, ఆరోగ్యం బాగా దెబ్బతినడం, తోటి ఖైదీలు ఆమెకు చేస్తున్న సపర్యలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సిబీఐ కోర్టు మానవతా దృక్పథంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలక్ష్మి పాత్రపై దర్యాప్తు పూర్తయినా, అనారోగ్యంతో అవస్థలు పడుతున్నా బెయిల్ కు అడ్డుపడటం సిబీఐ తీరుకు నిదర్శనమని డిఫెన్స్ లాయర్ వాదనతో ఏకీభవించిన జడ్జి దుర్గాప్రసాద్ తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు శ్రీలక్ష్మికి మధ్యంతర బెయిల్ పొడిగిస్తున్నట్లు తీర్పు నిచ్చారు.