Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలో కరోనాతో మరో 55 మంది మృతి
posted on: Sep 23, 2020 5:49PM
ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 7-8 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 72,838 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,228 మందికి పాజిటివ్ గా తేలింది. తాజా కేసులతో రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,46,530 కి పెరిగింది. గత 24 గంటల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,506 కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,70,667కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 70,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి.






