TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరోనా కలకలం.. దేశంలో పెరుగుతున్న కేసులు

Published on: Fri Jun 6, 2025 12:56PM

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో 489 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,364కు చేరుకుంది. ఇలా ఉండగా కరోనా కారణంగా గత 24 గంటల్లో నలుగురు మరణించారు. కేరళలో ఇద్దరు, పంజాబ్ ,కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 55కు చేరుకుంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే నిన్న ఒక్క రోజే కొత్తగా 11 మందికి కరోనా సోకింది. ఏపీ, తెలంగాణ లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో ఒకే రోజు మరో 11 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.  నెల్లూరులో గురువారం (జూన్ 5) ఒక్కరోజే నలుగురికి,  విశాఖ కేజీహెచ్‌లో మరో కేసు నమోదయింది. నెల్లూరు జీజీహెచ్‌లో బుధవారం ఆరుగురికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో గురువారం నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 62కు చేరింది. ఇక  తెలంగాణలో 2 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో   యాక్టివ్ కేసుల సంఖ్య 5కు పెరిగింది.