Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో మొదటి కరోనా కేసు నమోదు
posted on: May 23, 2025 7:01PM

తెలంగాణలో మొదటి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని డాక్టర్‌కు కరోనా పాజిటివ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఏపీలో కరోనా కేసులు వెలుగు చూశాయి. ఏపీ విశాఖలో కొవిడ్ కేసు నమోదైంది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కొవిడ్ నిర్ధారణ అయ్యింది. కడపలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తీవ్ర జ్వరంతో కడప రిమ్స్ లో చేరిన నంద్యాల జిల్లా వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భారత్ లో ఇప్పటికే 257కేసులు కోవిడ్ నమోదయ్యాయి. కేరళాలో 200కుపైగా కేసులు నమోదయ్యాయి.
సింగపూర్, థాయిలాండ్, చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్ క్రమంగా భారత్ లోనే విస్తరిస్తుంది. ఆదిలోనే కరోనా కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు ప్రకటించాయి. ప్రజలు మాస్కులు ధరించాలని..కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఐసోలేషన్ కేంద్రాలు, ఆసుపత్రులను సిద్దం చేయాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. కొత్త కోవిడ్ వేరియంట్ ఇది సాధారణ కోవిడ్ కంటే వేగంగా వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. లక్షణాలు చాలామందిలో తేలికపాటి జ్వరంగా ఉంటాయి. కొందరికి గొంతునొప్పి, దగ్గు, అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు, అధిక వయసు వారికి జాగ్రత్తలు అవసరమైన పరిస్థితి. అయితే ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం ఏమి లేదని వైద్యులు అంటున్నారు.






