Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?
posted on: Jun 14, 2026 4:17PM

దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి 824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి.
తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. దాంతో ఏపీలో 25 ఎంపీ సీట్లు నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లను 3గా, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది.
ఆ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన రిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నష్టం, అధికార కూటమికి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే పట్టణ ప్రాంతాలు.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో బీజేపీ లబ్ది పొందే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009 ఎన్నికల ముందు జరిగిన డిలిమిటేషన్ సమయంలో కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. అనేక పాత నియోజకవర్గాలు రద్దయి, కొత్తవి ఏర్పడ్డాయి.
ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ఆధారంగా చాలా జనరల్ స్థానాలు రిజర్వ్‌డ్ స్థానాలుగా మారాయి. అది కలిసి వచ్చి ఏపీలో కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆ లెక్కలతోనే ఈ సారి నియోజకవర్గాల పెంపుతో ఎన్డీఏ కూటమికి ప్లస్ అవుతుందన్న విశ్లేషణలున్నాయి. అయితే ఏపీలో నియోజకవర్గాలపై ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదికతో వైసీపీకి లబ్ది చేకూరే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల పెంపునకు పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభాతో పాటు భాషా సమీకరణాలు, గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది.
ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. వీటిలో రాజంపేట, కడప మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం కూటమి ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఈ 7 లోక్‌సభ స్థానాలను విడగొట్టి 20 చేయాలి. ఆ పెరిగే స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ నియోకవర్గాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశముంది.
గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 4 ఎంపీ స్థానాల్లో అరకు ఎస్టీ, తిరుపతి ఎస్సీ రిజర్వ్‌డ్ కావడం గమనార్హం. నియోజకవర్గాల పెంపుతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆర్థిక సలహా మండలి సూచిస్తోంది. గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పరిమితమైన వైసీపీ దాదాపు 40 శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, సహజంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే వైసీపీ ఓటు షేరు ఎంతోకొంత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో వైసీపీ బలం పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు.
ఇటు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఓటర్ల బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే.
అంతో ఇంతో విద్యావంతులే మోడీ చరిష్మాకు ఆకర్షితులవుతున్నారు. ఆ బలంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ తెలంగాణలో ఏకంగా 8 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. ఇక ఇఫ్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ , చేవెళ్ల లోక్‌సభ స్థానాలను విడగొట్టి 14 స్థానాలు చేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. వాటిలో హైదరాబాద్ మినహా మిగిలిన నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలే గెలిచారు.
ఇక ముందు నుంచి కాషాయపార్టీకి కొరకరాని కొయ్యగా మారిన హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సారి హైదరాబాద్‌ను మూడు లోక్‌సభ స్థానాలుగా మారిస్తే ఎంఐఎంను పరిమిత ప్రాంతానికి కట్టడి చేసి, బీజేపీ బలం పెంచుకునే అవకాశముందంటున్నారు. మరి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఎంత వరకు అమల్లోకి వస్తాయో? నియోజకవర్గాల పెంపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఏ రేంజ్లో ప్రభావితం చేస్తాయో? ఖచ్చితంగా తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.


.webp)



