TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలుగుదేశాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్‌ సిఎంలు? రాజశేఖరరెడ్డి తరువాతి స్థానంలో కిరణ్‌!

Published on: Mon Oct 1, 2012 8:54AM

Congress Wrecking TDP, Late YS Rajasekhara Reddy, Bhuma Couple Into Congress, Telangana TDP Leader Sammari Sambaiah, CM Kiran Kumar, Chandrababu Naidu, Shanker Reddy,Congress Wrecking TDP, Late YS Rajasekhara Reddy, Bhuma Couple Into Congress, Telangana TDP Leader Sammari Sambaiah, CM Kiran Kumar, Chandrababu Naidu, Shanker Reddy,

తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌ పార్టీనేతలు దెబ్బతీశారు. ఎన్నికల్లో ఓటమి పాలు చేయటమే కాకుండా సిఎంగా పీఠమెక్కాక కూడా తెలుగుదేశం పార్టీని ఇక్కట్ల పాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలను ఆకర్షించటమే ప్రధానపనిగా పెట్టుకున్న దివంగత సిఎం రాజశేఖరరెడ్డి గురించి ఈ విషయంలో ఒకసారి ప్రస్తావించక తప్పదు. ఆయన అధికారంలోకి రావటం కోసం తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు నేతలను కాంగ్రెస్‌లోకి ఆకర్షించారు. అలానే  భూమా దంపతులు వంటివారు కాంగ్రెస్‌లోకి వలస వచ్చేశారు. ఆయన తరువాత ఇదే పథకాన్ని అమలు చేసి తెలంగాణాలోని సమ్మారి సాంబయ్యను సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి ఏకంగా పార్టీ తరుపున పోటీకి నిలబెట్టారు. ఈయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేత. అలానే సిఎం కిరణ్‌ చిన్నం రామకోటయ్య వంటి ప్రముఖులను ఆకర్షించేందుకు కృషి చేశారు. తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో చంద్రబాబు అంటే ప్రాణం అన్నట్లుండే మాజీ ఛైర్మన్‌ శంకరరెడ్డిని కాంగ్రెస్‌ తరుపున పని చేసేందుకు  సిఎం మద్దతు కోరారు. ఆయనకు పార్టీ తీర్థం ఇచ్చి మరీ పని చేయించుకున్నారు. తాజాగా టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, రాయలసీమ ప్రత్యేకరాష్ట్ర సాధన కమిటీ అధ్యక్షుడు బైర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కూడా సిఎం కిరణ్‌ ఆకర్షిస్తున్నారు. బైర్రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకునేందుకు ఇప్పటికే సిఎం ఏర్పాట్లు చేశారని తెలిసింది. ఇలానే మరికొందరిని సిఎం కిరణ్‌ టార్గెట్‌ చేశారని తెలుస్తోంది. రాజశేఖరరెడ్డి తరువాత సిఎం పీఠాన్ని ఎక్కిన కిరణ్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరిట రచించిన వ్యూహం మరిన్ని సత్ఫలిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.