TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్ట డి ఉద్రిక్తం.. రేవంత్ సహా ముఖ్యనేతలు అరెస్ట్

Published on: Thu Jun 16, 2022 1:06PM

మోడీ కో హటావ్ దేశ్ కో బచావ్ నినాదాలతో రాజ్ భవన్ పరిసరాలు అట్టుడికాయి. రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు కదలి వచ్చాయి.  

న్యూఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చేసిన దాడులను నిరసిస్తూ గురువారం దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది.  దీంతో దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా  హైద్రాబాద్ లోని రాజ్ భ‌వ‌న్ ముట్ట‌డికి కాంగ్రెస్ నేత‌లు ముట్ట‌డికి యత్నించారు. వి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకొంది ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

పోలీసుల తీరుకు నిరసనగా ఖైరతాబాద్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బైక్ కు నిప్పు పెట్టి నిరసనకు దిగారు. మరో వైపు బస్సును రోడ్డుపై నిలిపివేసి బస్సుపైకి ఎక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది.  కాగా పోలీసులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్ బాబు, అంజన్ కుమార్ తదితరులను అరెస్టు చేశారు.