TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి మృతి

Published on: Tue Aug 25, 2015 3:32PM



తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఈయన గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఈయన హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్‌లో నిద్రలోనే తుది శ్వాస విడిచినట్టు చెబుతున్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ప్రస్తుతం ఆయన పిఏసి చైర్మన్‌గా ఉన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున నారాయణ ఖేడ్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.


కాగా కిష్టారెడ్డి మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ నీరుపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ జిల్లా గొప్ప నేతను కోల్పోయిందని సంతాపం తెలిపారు.  డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కిష్టా రెడ్డి మృతి తెలిసి తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు.