Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ కి షాక్.. టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్యే
posted on: Mar 8, 2019 11:03AM
తెలంగాణలో కాంగ్రెస్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సుక్కు కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పగా.. ఇప్పుడు వారి బాటలోనే మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయనే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ని కలిసి మాట్లాడిన ఆయన.. రెండు మూడు రోజుల్లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. చిరుమర్తి టీఆర్ఎస్ వైపు చూడడానికి మంత్రి జగదీశ్వర రెడ్డి కారణమని తెలుస్తోంది. ఆయనే చిరుమర్తితో చర్చలు జరిపి టీఆర్ఎస్ లో చేరేలా పావులు కదిపారని సమాచారం. మరోవైపు చిరుమర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. కాంగ్రెస్ నేతలకు టచ్ లో లేకుండా ఆయన ఫోన్ సైతం స్విచ్‌ఆఫ్ చేసారని తెలుస్తోంది.
అయితే చిరుమర్తి కాంగ్రెస్ ని వీడి టీఆర్ఎస్ లో చేరితే కోమటిరెడ్డి బ్రదర్స్ కి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో చిరుమర్తికి నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోమటిరెడ్డి బ్రదర్స్ పట్టుబట్టారు. చిరుమర్తికి టికెట్ ఇవ్వకపోతే తాము కూడా పోటీ చేయమని అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి పంతం నెగ్గించుకున్నారు. మరి చిరుమర్తి టికెట్ కోసం అంత పట్టుబట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్.. ఇప్పుడు ఆయన్ని కాంగ్రెస్ ని వీడకుండా చూడలేకపోతే వారికి గట్టి దెబ్బనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి దీనిపై కోమటిరెడ్డి బ్రదర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.






