Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రివర్స్ పంచ్.. టీడీపీలోకి రఘువీరారెడ్డి!!
posted on: Jul 7, 2019 5:42PM

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడంతో.. ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, కొందరు నాయకులు బీజేపీలో చేరగా.. మరి కొందరు నాయకులు కూడా బీజేపీలో చేరడానికి సిద్దమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వీరందరికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తాజా మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం టీడీపీలో చేరాలనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీ కూడా ఇవ్వలేకపోవడంతో.. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. టీడీపీలో చేరితే రాబోయే కాలంలో తనకి రాజకీయ భవిష్యత్ ఉంటుందనే ఆలోచనతో.. ఆయన టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఒకవైపు టీడీపీకి భవిష్యత్ లేదని ఆ పార్టీ నుంచి పలువురు నాయకులు పార్టీని వీడి వెళ్తుంటే.. మరోవైపు రఘువీరారెడ్డి టీడీపీలో చేరే సాహసం చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూద్దాం మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.






