వరంగల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడుకు మృతి..

వరంగల్ జిల్లా ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేంద్రరెడ్డి కుమారుడు విశాల్ రెడ్డి మరణించాడు. వరంగల్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మోటారు బైక్ మీద వెళుతున్న విశాల్ రెడ్డిని ఆర్టీసీ బస్సు ఒకటి బలంగా ఢీ కొట్టింది. దీంతో విశాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.

కాగా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదం జరిగి మాజీ డీజీపీ.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పేర్వారం రాములు మనవలు అవిత్ పవార్, వరుణ్ పవార్ లు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మిల్క్ ట్యాంకర్ ను వెనుక నుండి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu