టీఆర్ఎస్ లోకి గడ్డం ప్రసాద్ కుమార్? కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు..!

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి గడ్డం ప్రసాదకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లోకి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ లోకి రావాలని కేసీఆర్ నన్ను ఆహ్వానించిన మాట వాస్తవమే అని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ నన్ను పట్టించుకోవడంలేదు.. మాజీ మంత్రి చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడంపై కూడా నన్ను సంప్రదించలేదు అని ఆరోపించారు. మంత్రి కేటీఆర్ నాకు మంచి మిత్రుడు అని.. టీఆర్ఎస్ లో చేరే విషయంపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. తన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

అయితే రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి గెలుపుకు గాను మెజార్జీ తక్కువగా ఉన్న నేపథ్యంలో టిఆర్ఎస్‌కు సంఖ్యాబలం అవసరం ఉంది. దీంతో కావాలనే గడ్డం ప్రసాద్ కుమార్ టీఆర్ఎస్ గాలం వేసినట్టు కనిపిస్తోంది. అంతేకాదు ప్రసాద్ కుమార్ పార్టీలోకి వస్తే టిఆర్ఎస్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి, అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలను అప్పగించడానికి కూడా టిఆర్ఎస్ నాయకత్వం రెడీగా ఉందంట. కాగా ప్రసాద్ కుమార్‌తో పాటు 30 మంది ఎంపిటీసిలు, కౌన్సిలర్లు టిఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది.