టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం క్లాస్.. జానారెడ్డికి స్పెషల్ గా
posted on Dec 14, 2015 2:07PM
.jpg)
తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకుగాను జరగాల్సిన పోటీ కాస్త టీఆర్ఎస్ వల్ల ఆరు స్థానాలకే జరగనుంది.ఉన్న 12 స్థానాల్లో ఏకంగా ఆరు స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది టీఆర్ఎస్.అయితే ఇక్కడి వరకూ బానే ఉన్నా ఇప్పుడు టీఆర్ఎస్ ఏకంగా ఆరు స్థానాలు.. అది కూడా ఏకగ్రీవంగా గెలుచుకోవడంతో..కాంగ్రెస్ పార్టీ నేతలకు అధిష్టానం క్లాస్ పీకనున్నట్టు తెలుస్తోంది.ఎందుకంటే.. టీఆర్ఎస్ పార్టీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్లు పొందిన నేతలు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవడం.. టీఆర్ఎస్ తో బప్పందాలు కుదుర్చోవడం.. వంటివి జరగడం..ఇదంతా కాంగ్రెస్ నేతల వైఫల్యమే అని గ్రహించి కాంగ్రెస్ పార్టీ వారికి తలంటనున్నట్టు తెసుస్తోంది.ఇందులో భాగంగానే వారిని అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకున్న్టట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి - సీఎల్ పీ నేత జానారెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క - మాజీ మంత్రులు దానం నాగేందర్ - సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు.
అయితే అందరి సంగతేమో కాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన జానారెడ్డికి మాత్రం స్పెషల్ క్లాస్ ఉన్నట్టు చెబుతున్నారు.ఇప్పటికే జానారెడ్డి పై అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందాయి.టీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నట్టు గతంలో వాదనలు కూడా వినిపించాయి.దీంతో జానారెడ్డికి మిగితా వారికంటే కాస్త ఎక్కువ క్లాస్ ఉండొచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.