టీమ్ జేఎన్‌జేకే కాంగ్రెస్  సంపూర్ణ మ‌ద్ద‌తు 

జెఎన్జె హౌసింగ్ సొసైటీకి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాగ్రెస్ పార్టీ టీమ్ జేఎన్‌జేకు సంపూర్ణ‌ మ‌ద్ద‌తునిస్తోంద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు బి.మ‌హేష్‌కుమార్‌గౌడ్ చెప్పారు. 
గ‌తంలో బీఆర్ఎస్‌కు చెందిన వ్య‌క్తులు జ‌ర్న‌లిస్టుల‌ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని, దాన్ని తిప్పికొట్టేందుకు పోరాడిన టీమ్‌జేఎన్‌జేకు... నాడు టీపీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి గారు పూర్తి మ‌ద్ద‌తునిచ్చార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌జేఎన్‌జేకు ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నార‌న్నారు. 
ఈసారి జ‌రగ‌నున్న సొసైటీ ఎన్నిక‌ల్లో టీమ్‌జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను అఖండ మెజార్టీతో గెలిపించాల‌ని పాత్రికేయ మిత్రుల‌కు ఆయ‌న‌ విజ్ఞ‌ప్తి చేశారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu