TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముదిరిపాకాన పడిన కర్నాటక కాంగ్రెస్ సంక్షోభం

Published on: Fri Mar 13, 2026 12:16PM

కర్ణాటక కాంగ్రెస్‌లో  సంక్షోభం ముదిరి పాకాన పడింది. ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో పాతిక మందికి పైగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి బెంగళూరులో రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.

కాగా  బుధవారం జరిగిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి 50 మందికి పైగా ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వడం తేలిసిందే. ఈ నేపథ్యంలోనే  పాతిక మంది ఎమ్మెల్యేల రహస్యభేటీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలను వేడెక్కించింది. తాజా భేటీలో,   అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయనీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.