రేవంత్ తో భేటీ అయిన  కాంగ్రెస్ అభ్యర్థులు బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి 

posted on: Mar 9, 2024 2:06PM

మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ శనివారం కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అధిష్ఠానం నిన్న నాలుగు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్‌కు అవకాశం ఇచ్చింది. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన బలరాం... 2014, 2019 ఓడిపోయారు. వరుసగా రెండు పర్యాయాలు మహబూబాబాద్ లోకసభ స్థానంనుంచి ఓటమిని చవి చూసిన బలరాం నాయక్ కు తిరిగి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 15వ లోక్‌సభకు పోటిచేసి భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి కుంజా శ్రీనివాసరావుపై 68.957 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2012 అక్టోబరులో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. 

మహబూబ్ నగర్ లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంశీచంద్ రెడ్డి 2014లో కాంగ్రెస్ తరఫున కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఓడిపోయారు. 2019 మహబూబ్ నగర్ లోక్ సభ ఎన్నికల్లోనూ పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి ఇదే లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులు అందరూ కలిసి మధ్యాహ్నం ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి, సురేశ్ షేట్కార్ తదితరులు ఉన్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...