TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదరరెడ్డి?

Published on: Thu Aug 11, 2022 7:15AM

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది తేలిపోయిందా అంటే కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదరరెడ్డి దాదాపుగా ఖరారయ్యారని చెబుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మునుగోడు లో విజయం సాధించాలన్న పట్టుదలతో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డికి దీటైన అభ్యర్థిగా రాంరెడ్డి దామోదరరెడ్డి నిలుస్తారని భావిస్తున్నదని చెబుతున్నారు.

ఈ మేరకు రాంరెడ్డి దామోదరరెడ్డి అభ్యర్థిత్వాన్ని పీసీసీ ప్రతిపాదించగా సీఎల్పీ కూడా సమర్ధించిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే రాంరెడ్డి దామోదరరెడ్డి అభ్యర్థిత్వానికి పార్టీ సీనియర్ నాయకులు జానారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు కూడా మద్దతు ఇస్తున్న్లారని అంటున్నారు.