తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన ఏపీ కాంగ్రెస్

posted on: Mar 8, 2019 12:11PM

 

విభజన ఎఫెక్ట్ తో ఏపీలో 2014 ఎన్నికల్లో పూర్తిగా డీలా పడిపోయిన కాంగ్రెస్.. 'ప్రత్యేక హోదా' సంజీవనితో ఏపీలో పార్టీని బ్రతికించుకోవాలనుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించాలని భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ.. ఎన్నికల్లో ఒంటరి పోరుకి సిద్ధమవుతోంది. దానిలో భాగంగానే తమ పార్టీ తరుపున ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని తాజాగా కాంగ్రెస్ ప్రకటించింది. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి తమ పార్టీ తరపున ప్రముఖ న్యాయవాది హరేసముద్రం అశ్వద్ధ నారాయణ బరిలోకి దిగుతారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. నారాయణ విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెలాఖరులోగా అన్ని అసెంబ్లీలకూ అభ్యర్థులను ప్రకటిస్తామని రఘువీరారెడ్డి వెల్లడించారు. మరి 2014 ఎన్నికల్లో ఏపీలో ఖాతా తెరవని కాంగ్రెస్ ఈసారైనా తెరుస్తుందేమో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...