Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోనియా దయే డీఎస్
posted on: Oct 26, 2011 10:00AM
హై
దరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ దీవెనలతోనే తనకు ఎమ్మెల్సీ స్థానం దక్కిందని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్ నేత చిరంజీవితో అన్నారు. నామినేషన్ కార్యక్రమం సమయంలో మద్దతు తెలిపేందుకు వచ్చిన చిరంజీవిని ఆయన నివాసంలో మంగళవారం డీఎస్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. డీఎస్‌ను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారుపై చర్చ జరిగింది. కార్యకర్తలు ఓపిగ్గా ఉంటే అవకాశాలు వాటంతటవే వస్తాయని, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని చివరి వరకూ ఊహించలేకపోయాని డిఎస్ చిరంజీవితో అన్నట్లు సమాచారం. ఓపికతో వ్యవహరిస్తే అధిష్ఠానం తప్పకుండా క్రమశిక్షణ, విశ్వసనీయతను గుర్తిస్తుందని డీఎస్ వివరించారు. ఈ సందర్భంగా డీఎస్‌ను చిరంజీవి సన్మానించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా డిఎస్ క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఆయన నివాసంలో డీఎస్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.


.jpeg)
.jpeg)


