రేవంత్ రెడ్డి క్షమాపణ కోరుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన 

posted on: Aug 1, 2024 3:18PM

మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడిన రేవంత్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కె. తారకరామారావ్ , మాజీ మంత్రి హరీష్ రావ్  గురువారం(ఆగస్టు 1) ఆందోళన చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ ముఖ్యమంత్రి ఛాంబర్ కార్యాలయం ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. సబితకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు.
పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. మహిళా శాసనసభ్యుల పట్ల అనుచితంగా, అగౌరవంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా ఎమ్మెల్యే పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఈ రోజు నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...