Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లగడపాటిపై సి.బి.ఐ.కి ఫిర్యాదు
posted on: May 18, 2012 12:38PM
విజయవాడ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై హైదరాబాద్ లోని ముస్లీంలు కత్తి గట్టారు. వందలాది కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో లగడపాటి అక్రమంగా కారు చౌకగా కొట్టేశారని వారు ఆఒపిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. మణికొండలోని భూములను లగడపాటికి చెందిన ల్యాంకో కంపెనీ పబ్లిక్ ఆక్షన్ లో కొనుగోలు చేసింది. ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత ఈ భూముల్లో కొంత వక్ఫ్ ఆస్తులుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణావాదులు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఆ తర్వాత హఠాత్తుగా అక్కడనుంచి టెంట్ లు పీకేశారు. వారికి పెద్దమొత్తంలో ముడుపులు అందాయని అందుకే వారు ఆ అంశాన్ని వదిలేశారని ముస్లీం మైనార్టీ సంస్థలు ఆరోపిస్తున్నాయి.
టి.ఆర్.ఎస్. వదిలేసినా తాము మాత్రం రాజగోపాల్ ను వదిలేది లేదంటున్నారు ఆల్ ఇండియా ముస్లీం మైనార్టీ నేతలు. మణికొండలో అప్పట్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన మేళ్ళకు ప్రతిఫలంగా లాంకో సంస్థ సుమారు 30 కోట్ల రూపాయల వరకూ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని వారు ఆరోపిస్తూ సి.బి.ఐ.కి ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరిపి రాజగోపాల్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


.png)
.png)


