Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్ చెందిన 400 డ్రోన్లు ధ్వంసం..ప్రతిదాడిలో పాక్‌కు తీవ్ర నష్టం : కల్నల్ ఖురేషి
posted on: May 9, 2025 7:21PM

భారత్ మీద పాకిస్తాన్ దాడి చేయడానికి 400 డ్రోన్లు తుర్కియే దేశం ఇచ్చిందని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించింది. నిన్న అర్ధరాత్రి 36 ప్రాంతాలపై 300-400 వరకు డ్రోన్లతో దాడి జరిగింది.. ఈ డ్రోన్లు తుర్కియే దేశం నుండి వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని కల్నల్ పేర్కొన్నాది. ఎల్‌ఓసీ వెంట పాక్ ఉల్లంఘనలకు పాల్పడిన సామాన్య పౌరులపై కాల్పులు జరుపుతోందని కల్నల్ సోఫియా తెలిపారు. సరిహద్దుల్లోని 36 ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిందని పేర్కొంది. అయితే భారత సైనిక దళాలు సమర్థవంతంగా పాక్ డ్రోన్లను కూల్చివేసినట్లు వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన తాజా వివరాలను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరించారు.
మరోవైపు పాకిస్థాన్‌లోని నాలుగు వైమానిక రక్షణ ప్రదేశాలపై సాయుధ డ్రోన్‌లను భారత్ ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. ఆ డ్రోన్స్‌లో ఒకటి ఏడీ రాడార్‌ను నాశనం చేసిందని చెప్పారు. కాగా, నియంత్రణ రేఖ వెంబడి భారీ క్యాలిబర్ ఆయుధాలతో పాక్ కాల్పులు జరిపిందని, పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంపై దాడికి ప్రయత్నించిందని కల్నల్ సోఫియా ఖురేషి తెలిపారు. భారత్ జరిపిన ప్రతీకార కాల్పుల్లో పాకిస్థాన్ సైన్యానికి కూడా భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
పలు నగరాలు లక్ష్యంగా డ్రోన్లతో దాడికి దిగింది పాకిస్తాన్. దాయాది దేశం దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాం. పూంఛ్‌లోని గురుద్వారాపై దాడి చేయడం దారుణం. ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేస్తోంది. ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. భారత్ ప్రతి దాడులతో పాక్‌కు భారీ నష్టం జరిగింది. పాక్ సైనికుల కాల్పుల్లో ఇద్దరు పాఠశాల విద్యార్థులు మరణించారు. సరిహద్దుల్లో పాక్ సైన్యం ప్రయోగించిన క్షిపణి శకలాలు కనిపించాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను తాత్కాలికంగా మూసివేశామని వారు వెల్లడించారు.


.webp)



