యోగికి కీలక బాధ్యతలు..

posted on: Mar 27, 2017 6:10PM

 

ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చూపిస్తున్న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ కు మరికొన్ని బాధ్యతలు వచ్చిపడ్డాయి. ఇప్పటికే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో అధికారం చేపట్టి మంచి ఫాంలో ఉంది బీజేపీ. ఇప్పుడు త్వరలో గుజరాత్ లో జరగనున్న ఎన్నికలపై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగానే గుజరాత్ లో భారీగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. 150 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే జనాల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ సేవలను గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది.  ఈ నేపథ్యంలో, గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారం చేస్తారని ఆ పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. ఏది ఏమైనా అతి తక్కువ కాలంలోనే యోగి ఇంత పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమే. మరి యోగి మార్క్ గుజరాత్ ఎన్నికల్లో ఎంత వరకూ ఉపయోగపడుతుందో చూద్దాం.

google-ad-img
    Related Sigment News
    • Loading...