TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి

Published on: Thu Sep 25, 2025 2:43PM

 

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెన్నై బయలుదేరి వెళ్లారు. గురువారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన చెన్నైకి బయలుదేరారు. అదే రోజు సాయంత్రం చెన్నైలో  తమిళనాడు ప్రభుత్వం మహా విద్యా చైతన్య ఉత్సవ్‌ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటారు.ఆ కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా  బుధవారం (సెప్టెంబర్ 24) బిహార్ రాజధాని పాట్నా వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సంగతి తెలిసిందే. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన వెంటనే చెన్నైకు బయలుదేరారు.  త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఎన్నికల్లో ఇండి కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అచితూచి అడుగులు వేస్తోంది. ఇక తమిళనాడులోని డీఏంకే ప్రభుత్వం సైతం ఇండి కూటమిలో భాగస్వామి అన్న సంగతి అందరికి తెలిసిందే. బీసీ రిజర్వేషన్ల తో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ రేవంత్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్ లో రేవంత్ స్టార్ క్యాంపెయినర్ గా పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.