తెలంగాణ స్పోర్ట్స్ హబ్ చైర్ పర్సన్‌గా ఉపాసన నియామకం
posted on Aug 4, 2025 6:15PM

తెలంగాణ అంతర్జాతీయ స్పోర్ట్స్ చైర్మన్లు గా సంజీవ్ గోయంకా గ్రూప్ చైర్మన్ సంజీవ్ గోయంకా, యువర్ లైఫ్ సిఇఓ ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ లో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ, అభివృద్ధి తదితర అంశాలఫై దృష్టి సారిస్తారు.
సభ్యులుగా విటా డానీ (డానీ ఫౌండేషన్), మాజీ క్రికెటర్ కపిల్ దేవ్, సన్ నెట్ వర్క్స్ సిఇఓ కావ్య మారన్, సి. శశిధర్ (విశ్వ సముద్ర), పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), రవికాంత్ రెడ్డి (వాలీబాల్), బైచుంగ్ భూటియా (ఫుట్ బాల్), అభినవ్ బింద్రా (షూటింగ్), క్రీడల శాఖ అధికారులు బి. వెంకట పాపారావు, ఇంజేటి శ్రీనివాస్ లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది.
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్ ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ప్రపంచంలో తెలంగాణ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని సంతోషం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి చైర్ పర్సన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.