TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త రేషన్​కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు

Published on: Fri Jul 11, 2025 7:10PM

 

తెలంగాణలో ఈనెల 14న తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ఉంటుందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 2.4లక్షల నూతన రేషన్‌కార్డులను పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 11.30లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణలో గత ఆరు నెలల్లో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్‌ పంపిణీ చేసింది. 

త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్‌కార్డుల సంఖ్య 94,72,422కి చేరనుంది. మొత్తంగా 3.14కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. రేషన్ కార్డుల జారీ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల కార్డు రేషన్ కార్డులిస్తామని తెలిపారు. రేషన్‌కార్డుల మంజూరుతో నిరుపేదలకు భారీగా లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది.