TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..ఎందుకో తెలుసా?

Published on: Thu May 22, 2025 4:06PM

 

సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో రెండవసారి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు.  2023లో బేగంబజార్, నల్గొండ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో, సీఆర్పీసీ 313 ఎగ్జామినేషన్లో భాగంగా సీఎం హాజరయ్యారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని గతంలో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది.  గత శాసన సభ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌ సంబంధించిన కేసులో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు హాజరయ్యారు. నల్గొండ టూ టౌన్ పీఎస్, బేగంబజార్ పీఎస్, మెదక్ జిల్లా కౌడిపల్లి పీఎస్ పరిధిలో నమోదైన మూడు కేసుల్లో వ్యక్తిగతంగా జడ్జి ముందు హాజరయ్యారు. 

ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టు హాల్ దగ్గరకు ఇతరులను అనుమతించలేదు. రేవంత్ రెడ్డిపై ఈ కేసులు నమోదైన సమయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని కోర్టుకు విన్నవించారు. పోలీసులు చెప్తున్నవి అన్నీ కూడా అవాస్తవాలు. తాను ఎక్కడ ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు జూన్ 12వ తేదీన నాంపల్లి స్పెషల్ కోర్టు తీర్పు ప్రకటించనుంది.