TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్టీఐ కొత్త లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

Published on: Mon Oct 6, 2025 5:34PM

 

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్‌ నూతన లోగోను సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఈ నూతన  లోగోను ఆవిష్కరించారు. 20వ జాతీయ ఆర్టీఐ వారోత్సవాల సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్ బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి నేతృత్వంలోని బృందం హాజరైంది. 

తెలంగాణలో సమాచార హక్కు కమిషన్‌లో చాలాకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను రేవంత్ సర్కార్ ఇటీవలే భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ల బృందం ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను కలిసిన వారిలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి ఉన్నారు.