Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అది బీఆర్‌ఎస్ పార్టీ కాదు.. దెయ్యాల పార్టీ : సీఎం రేవంత్
posted on: Jun 6, 2025 6:31PM
.webp)
బీఆర్‌ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అది బీఆర్‌ఎస్ కాదని దెయ్యాల రాజ్య సమితి అని రేవంత్ సైటెర్ల వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. గంధమల్ల రిజర్వాయర్‌కు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారు.
అలాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్, యాదగిరిగుట్ట మెడికల్ కాలేజ్, వేద పాఠశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. కొలనుపాక-కాల్వపల్లి హైలెవెల్ వంతెన, మోటకొండూరులో ఎంపీపీ, మండలాఫీసు, పోలీస్ స్టేషన్ భవనాలకు కూడా శంకు స్థాపన చేశారు. వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శంగా మారుస్తామని చెప్పి ఇళ్లు కులగొట్టి. సొంత ఫామ్‌హూస్‌కు వెళ్లేందుకు ఎర్రవళ్లికి రోడ్డు వేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


.webp)



